Sunday, May 5, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కి మద్దతుగా ఎన్టీఆర్ కూతురు.. అమె దెబ్బకి టీడీపీ విలవిల కొట్టుకుంది..

- Advertisement -
NTR’s daughter support YS Jagan

ఏపీ ప్రతిపక్ష నేతవైసీపీ అదినేత వై య‌స్ జగన్ మోహన్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కలవడం.. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా జగన్.. మోడీని కలవాలనుకున్న.. అది ఇప్పటికి కుదిరింది. జగన్ మోడీతో బేటీ అనంతరం బీజేపీకి తాను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఈ ప్రకటన చేయగానే ఆంధ్ర ప్రదేశ్ అదికార పార్టీ నేతలు జగన్ పై మండి పడ్డారు. జగన్ తనపై కేసులను కొట్టివేయడానికే మోడీని కలిసారు అని అన్నారు. అయిన జగన్ ని కలవడానికి మోడీ ఎలా అనుమతి ఇచ్చారని టీడీపీ నేతలు విరుచుకు పడ్డారు. దాంతో టీడీపీ చేస్తున్న వ్యాఖ్యాలపై ఏపీ బీజేపీ నాయకత్వం విరుచుకుపడింది. ప్రధాని ఓ రాష్ట్ర ప్రతిపక్ష నేతను కలిస్తే అందులో తప్పు ఏముంది.. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవొచ్చని, ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగానే జగన్ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారని బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి సిద్దార్థనాథ్ సింగ్ అన్నారు. పైగా ఆయన ఒక్కరే వెళ్లలేదని, ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారు కదా అని వ్యాఖ్యానించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అసలు ఆయన ప్రధానమంత్రి మోదీని కలవడానికి, కేసులకు సంబంధం ఏంటని సిద్దార్థనాథ్ సింగ్ అడిగారు. కేసుల విషయాన్ని కోర్టులు చూసుకుంటాయని చెప్పారు. ఏపీకి చెందిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ తీరుపై మండిపడ్డారు. మోడీ, జగన్ కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూసారా అని ఆయన్ ప్రశ్నించారు. టీడీపీ నాయకులు స్థాయి మరిచి నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్ ప్రధానమంత్రిని కలిస్తే తప్పేముందన్నారు. వైఎస్‌ జగన్ ఏమైనా ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. జగన్.. మోడీని కలిస్తే.. టీడీపీ నాయకులకు ఎందుకు అంత భయమో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ నేతలను అడిగి అపాయింట్‌ మెంట్‌ ఇచ్చుకునే దౌర్భగ్య స్థితిలో ప్రధాని లేరని వ్యాఖ్యానించారు.

ప్రధాని అన్నక చాలా మందిని కలుస్తారని.. అంత మాత్రాన.. ఇంత రచ్చ చేయాలా అని మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి చాలా ఘాటుగా స్పందించారు. జగన్ మోడీ కాళ్ళ మీద పడటం మీరు చూసారా..? మేము చూసామా..? ఇలాంటి అర్దం ప‌ర్ధం లేని వ్యాఖ్యలు చేయడం ఎంటని అమె మండి పడ్డారు. అధికారపార్టీ టీడీపీ హద్దులో.. ఉండాలని.. ప్ర‌ధానిని విమ‌ర్శించే స్థాయి వారికి లేదని.. ఒళ్ళు ద‌గ్గ‌ర‌బెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని.. పురంధ‌రేశ్వ‌రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే పురంధ‌రేశ్వ‌రి ఇలా జగన్ కి మద్దతుగా మాట్లాడి.. టీడీపీ త‌మ్ముళ్ళ‌పై విరుచుకుపడటం ఇప్పుడు రాజకీయాలో చర్చనీయంశం అయ్యింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -