Thursday, April 18, 2024
- Advertisement -

నేను లోకల్ ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

- Advertisement -
Nani Nenu Local Movie Collections

ప్రస్తుతం నాని సినిమా ఎలా ఉన్న ఓ 15 కోట్లు వస్తాయన్న నమ్మకం వచ్చేసింది నిర్మాతలకు. ఇక సినిమా హిట్ అయితే ఓ రెంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. సో నాని సినిమాకి ఓ పెద్ద హిరో సినిమాకి పెట్టే బడ్జెట్ నాని సినిమాకి కూడా పెట్టడానికి వెనకడటం లేదు నిర్మాతలు. అయితే ఇటివలే నాని నటించిన నేను లోకల్ సినిమా పెద్ద హీరోల సినిమా స్థాయిలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్ల మార్కు చేరింది.

మంగళ వారం నాటికి ఈ సినిమా రూ.19 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది.  రోజు మార్నింగ్ షో వసూళ్లను కలుపుకుంటే ‘నేను లోకల్’ రూ.20 కోట్ల షేర్ మార్కును దాటేసినట్లే. మొదట్ వీక్ లో హౌస్ ఫుల్స్ తో ఆడిన ఈ సినిమా సోమవారం కూడా అదే రెంజ్ లో నడుస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా లాభాల వాట పట్టడం ఖాయమని తెలుస్తోంది. రెండో వీకెండ్లో కూడా సినిమాకు మంచి వసూళ్లు వచ్చే చాన్స్ ఉన్నట్లు బయ్యర్లు తెలుపుతున్నారు.

ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.30 కోట్ల షేర్ సాధించి.. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ను అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వారంలో ‘ఎస్-3’తో పాటు ‘ఓం నమో వెంకటేశాయ’ విడుదల అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల పై పాజిటివ్ టాక్ ఉంది. సో ఈ రెండు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకుంటే.. నేను లోకల్ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల మధ్యలో కూడా నాని సినిమా ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related

  1. ‘నేను లోకల్’ మూవీ రివ్యూ!
  2. నాని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్‌
  3. పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!
  4. నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -