Wednesday, May 1, 2024
- Advertisement -

నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?

- Advertisement -

నాని ప్రస్తుతం ‘మజ్ను’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నాని నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘భలే భలే మగాడివోయ్‌’ తరువాత అదే సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ను రిపీట్‌ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపిసుందర్‌ సారధ్యంలో ‘మజ్ను’ పాటలు రూపొందాయి. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో నాని హీరోగా  ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ సినిమాని తీసిన దర్శకుడు విరించి వర్మ ఈ ‘మజ్ను’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంకు సంబంధించి మొదటి సాంగ్ ను ఈరోజు రేడియో మిర్చి ద్వారా రిలీజ్ చేశారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. కెమెరా పనితనం, అత్తారింటికి దారేది, సోగ్గాడే చిన్ని నాయనా, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు చేసిన ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్స్‌ కాబోతున్నాయి.

ఈ సినిమా ద్వారా ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ స్పెషల్ రోల్ కోసం నాని రాజమౌళిని అడగడంతో రాజమౌళి వెంటనే ప్రత్యేక పాత్రలో కనిపించడానికి సరే అన్నారట.

Related

  1. యేడాదిలో నాని సంపాద‌న తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
  2. నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల
  3. నాని రేటు ఎంతో తెలుసా?
  4. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -