Friday, April 19, 2024
- Advertisement -

శ్యామ్ సింగరాయ్.. డిఫెరంట్ లుక్‌లో నాచుర‌ల్ స్టార్ నాని

- Advertisement -

“అష్టాచ‌మ్మా” అంటూ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌ర్వాత విభిన్న‌మైన క‌థ‌లు.. అద్భుత‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు నాని. త‌న‌దైన స్ట‌యిల్ లో న‌టిస్తూ నాచుర‌ల్ స్టార్ గా మ‌స్తు క్రేజ్ సంపాదించుకున్నాడు నాని. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీబిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ప్ర‌స్తుతం తాను చేస్తున్న సినిమాల‌కు సంబంధించి ఒక్కొక్క‌టిగా అప్డేట్స్ ఇస్తున్నాడు.

మంగ‌ళ‌వారం ఆయ‌న న‌టిస్తున్న “ట‌క్ జ‌గ‌దీశ్” చిత్రం టీజ‌ర్ విడుద‌ల చేశాడు. ప‌ల్లే వాతావ‌ర‌ణం.. స్టైయిల్ లుక్‌.. ఫ్యామీలీ క‌లయిక‌ల‌తో అద‌ర‌గొట్టేశాడు. టీజ‌ర్‌తోనే ఆ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాడు. ఇక తాజాగా నాని న‌టిస్తున్న మ‌రో చిత్రం “శ్యామ్ సింగ‌రాయ్”చిత్రానికి సంబంధింంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఆ సోస్ట‌ర్‌కు “పేరు శ్యామ్‌.. పూర్తి పేరు” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ప్ర‌స్తుతం నాని శ్యామ్ సింగ‌రాయ్ పోస్ట‌ర్ తెగ వైర‌ల్ అవుతోంది. పోస్ట‌ర్లో నాని డిఫెరంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. జేబులో చేతులు పెట్టుకుని నాని నిల‌బ‌డి ఉండ‌గా.. వెనుక నుంచి చేతుల‌కు పారాని రాసుకున్న అమ్మాయి హ‌త్తుకుని ఉంది. కానీ ముఖం క‌నిపించ‌డం లేదు. కాగా, ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -