Friday, April 26, 2024
- Advertisement -

నీటి కోసం.. తెలుగు తమ్ముళ్లు కొట్లాట.. చెన్నై బెంచ్ తీర్పు..!

- Advertisement -

రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. ధిక్కరణ పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ ముగిసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను గవినోళ్ల శ్రీనివాస్ వేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి ఉల్లంఘనలపై నిజనిర్దరణ కమిటీ వేయాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది.

రాయలసీమ ఎత్తిపోతలకు.. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయరాదన్న ఆదేశాలను ఉల్లంఘించి… ఏపీ సర్కార్‌ పనులు కొనసాగిస్తోందని దాఖలైన పిటిషన్‌పై చెన్నై బెంచ్‌ విచారణ జరిపింది. అంతే కాదు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేస్తున్నారని పిటిషన్‌ వివరించారు.

ఈ వాదనతో విబేధించిన ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఎలాంటి పనులు సాగడంలేదని గతంలోనే సీఎస్‌ అఫడవిట్‌ వేసినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాయలసీమ ఎత్తిపోతలపై ఉల్లంఘనలు జరుగుతున్నాయో లేదో తేల్చేందుకు.. నిజ నిర్దరణ కమిటీ వేయాలన్న తెలంగాణ ప్రభుత్వ చేస్తున్న విజ్ఞప్తిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా,  కృష్ణాబోర్డు వేసే కమిటీ అధ్యయనం తర్వాత.. మళ్లీ రావొచ్చని పిటిషనర్‌కు సూచిస్తూ ఎన్జీటీ విచారణను ముగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -