అందుకే రాను అంటున్న నయనతార!

తెలుగు తో పాటు తమిళంలో కూడా వరస సినిమాలు చేస్తోంది అందాల భామ నయనతార. ప్రస్తుతం కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉంది నయనతార. ఇటివకే తెలుగులో బాబు బంగారంతో మంచి హిట్ అందుకుంది. అయితే కొన్ని రోజులుగా నయన్ మీద వస్తున్న రూమర్స్ గురించి షాకింగ్ నిజం చెప్పింది. ఇంతకీ నయనతార విషయం మీద క్లారిటీ ఇచ్చేసింది అంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో నలుగురు నాలుగు రకాలుగా తన గురించి మాట్లాడుతున్నారు.

ఇక ఇలానే ఉంటే బాగోదని నయనతార నోరు తెరచి తను ప్రమోషన్స్ కు రాకపోడానికి గల కారణాలు చెప్పింది. సినిమా సంగతి ఎలా ఉన్న విడుదలకు ముందు ప్రమోషన్స్ చేస్తే.. కలక్షన్స్ బాగా వస్తాయి అని దర్శక నిర్మాతల గట్టి నమ్మకం. అయితే నయనతార  సినిమాల్లో నటిస్తేనే హ్యాపీ అనుకునే వారు కొందరైతే నయనతార ప్రమోషన్స్ కు రావట్లేదని గొడవ చేసే వారు కొందరు. అయితే నయనతార మాత్రం సినిమాల ప్రమోషన్స్ రాకపోడానికి కారణం ఉందని చెబుతోంది.

తాను ఏదైతే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటానే ఆ సినిమా తుస్ మనడం ఖాయమని చెబుతుంది. ప్రమోషన్స్ విషయంలో తనది ఐరన్ లెగ్ అని అందుకే దర్శక నిర్మాతలు నొచ్చుకున్నా తాను ప్రమోషన్స్ కు వచ్చేది లేదని చెప్పేస్తానని అన్నది. ప్రస్తుతం విక్రం హీరోగా ఇరుమగన్ సినిమాలో నయనతర నటిస్తోంది.

Related

  1. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!
  2. నయనతార కొంప ముంచిన హీరో!
  3. నయనతార రేటు ఎంతంటే?
  4. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?