Thursday, March 28, 2024
- Advertisement -

అమీర్​ భాయ్​ ఇదేంటి? నీతులు చెప్పడానికేనా?

- Advertisement -

సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో అమీర్​ ఖాన్ ముందుంటాడన్న విషయం తెలిసిందే. గతంలో సత్యమేవ జయతే అనే షో ద్వారా ఎన్నో మంచి విషయాలు చెప్పేవాడు తప్పులపై ప్రశ్నించేవాడు. సత్యమేవ జయతే షో ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు అమీర్. తరుచూ సామాజిక అంశాలపై తనదైన స్టయిల్​లో వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. అయితే తాజాగా అమీర్​ ఖాన్​పై నెటిజన్ల నుంచి ఓ రేంజ్​లో విమర్శలు వచ్చాయి. ఇంతకీ విషయం ఏమిటంటే..

అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో అమీర్​ హీరోగా “లాల్‌ సింగ్‌ చద్దా” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్​ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్​ నటుడు నాగ చైతన్య సైతం ఈ మూవీలో ఓ పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం లడ్డాఖ్​ లో ఈ మూవీ షూటింగ్​ జరుగుతోంది. అయితే షూటింగ్​ జరుగుతున్న ప్రాంతాన్ని ఓ నెటిజన్​ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. అయితే ఈ వీడియోలో చిత్ర యూనిట్​ పడేసిన వాటర్​ బాటిల్స్​ కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

‘అమీర్​ భాయ్​ పర్యావరణం గురించి నీతి వాక్యాలు చెబుతావు. మరి ఇదేంటి’ అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు అమీర్​ ఖాన్​ను వెనకేసుకొస్తున్నారు. చిత్ర యూనిట్​ చేసిన పనికి అమీర్​ ఖాన్​ను బాధ్యుడు చేయడం సరికాదంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. తన భార్యకు విడాకులు ఇవ్వడంతో ఇటీవల అమీర్​ ఖాన్​ వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు అమీర్​ ఖాన్​.

Also Read

క్లాసిక్ ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్..!

మరో తమిళ హీరోతో తెలుగు డైరెక్టర్ సినిమా..!

మరో తమిళ హీరోతో తెలుగు డైరెక్టర్ సినిమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -