Friday, April 26, 2024
- Advertisement -

థర్డ్​వేవ్​ తప్పదు.. ఐఎంఏ కీలక ప్రకటన

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా థర్డ్​వేవ్​ విషయంలో ఆందోళన నెలకొన్నది. కొందరు నిపుణులు థర్డ్​వేవ్​ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఐఎంఏ (ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​) కీలక ప్రకటన చేసింది. థర్డ్​వేవ్​ విషయంలో దేశప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ నిబంధనలు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలు జోరుగా యాత్రలు, పర్యటనలు చేస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీనిపై ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజలు యాత్రలకు వెళ్లడం.. పుణ్యక్షేత్రాలకు వెళ్లడంతో కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఐఎంఏ పేర్కొన్నది. ఇటువంటి వ్యక్తులు సూపర్​ స్పైడర్లుగా మారి కరోనాను మరింత వ్యాపించేలా చేస్తారని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​లలో పూరీ జగన్నాథ యాత్ర జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎంఏ ఆదేశాలు కీలకంగా మారాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ముమ్మరం చేయాలని కూడా ఐఎంఏ సూచించింది. కరోనా థర్డ్​వేవ్​ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్​గా ఉండాలని ఐఎంఏ సూచించింది. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఉత్సవాలు, వేడుకులు సాగుతున్నాయి. ప్రజలు కూడా కరోనా విషయం మర్చిపోయారు.ఈ నేపథ్యంలో ఐఎంఏ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత ముమ్మరంగా చేపట్టాలని ఐఎంఏ కేంద్రానికి సూచనలు చేసింది.

Also Read

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -