Friday, April 26, 2024
- Advertisement -

స్పుత్నిక్​ వీ పై అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన రెడ్డీస్ ల్యాబ్స్​..!

- Advertisement -

మనదేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్​ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మొదటి వేవ్​ తర్వాత వ్యాక్సిన్​ తీసుకొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మరోవైపు కంపెనీల దగ్గర వ్యాక్సిన్ల లభ్యత కూడా సరిపడా లేదు. దీంతో మొదట్లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగింది. ఇదిలా ఉంటే కరోనా సెకండ్​ వేవ్​ అనంతరం ప్రజల్లో వాక్సినేషన్​ పై అవగాహన వచ్చింది. మరోవైపు సెకండ్​ వేవ్​లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో భయం ఏర్పడింది. దీంతో వ్యాక్సినేషన్​ కూడా ప్రజలు ఎగబడ్డారు.

ఇదిలా ఉంటే మనదేశంలో కోవాక్జిన్​, కోవిషీల్డ్​ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటు మోడెర్నా, స్పుత్నిక్​ వీ వంటి వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కూడా అనుమతులు వచ్చాయి. స్పుత్నిక్​ వీ 91.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని రుజువైంది. అయినప్పటికీ ఇది అందుబాటులో ఉంది. రష్యా టెక్నాలజీతో తయారైన స్పుత్నిక్​ వీని మనదేశంలో రెడ్డిస్ ల్యాబ్స్​ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది.

ఈ వ్యాక్సిన్​ ప్రజలకు ఎప్పటికి అందుబాటలలోకి వస్తుందన్న విషయంపై ఆందోళన నెలకొన్నది. ఇదిలా ఉంటే స్పుత్నిక్​వీ పై తాజాగా రెడ్డిస్ ల్యాబ్స్​ సంస్థ కీలక ప్రకటన చేసింది. ‘స్పుత్నిక్-వీ వ్యాక్సిన్​ కమర్షియల్‌ లాంచ్‌ నిలిచిపోలేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుంది’ అంటూ రెడ్డిస్ ల్యాబ్స్​ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో స్పుత్నిక్​ వీపైన ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.

Also Read

థర్డ్​వేవ్​ వచ్చేస్తోందా? భయపెడుతున్న కొత్త వేరియంట్లు..!

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

జికా వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -