Thursday, April 25, 2024
- Advertisement -

మన్యంలో క‌రోనా కలకలం.. 10 మంది మావోయిస్టులు మృతి!

- Advertisement -

దేశంలో రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా కరోనా మరణ ఘోష వినిపిస్తుంది. అయితే రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ‌తో మావోయిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నగరాల్లోనే కాదు.. మన్యంలోకి కూడా చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. మావోయిస్టులు కరోనా కాటుకు బలవుతున్నట్లుగా తెలుస్తుంది.

గిరిజనులు కూడా కరోనా బారిన పడినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్ వెల్ల‌డించారు. కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దళ కమాండర్లు కూడా ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఇక కుంట, డోర్నపాల్ ఏరియాల్లో మావోయిస్టులు కరోనా వ్యాక్సిన్‌తో పాటు దానికి సంబంధించిన ఔషదాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. క‌రోనా రెండో ద‌శ విజృంభణ కార‌ణంగా 100 మందికిపైగా మావోయిస్టులకు కొవిడ్ సోకింద‌ని అభిషేక్ ప‌ల్ల‌వ్ తెలిపారు.

ఇక కరోనా సోకిన వారిలో మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. కోవిడ్ తో బాధపడుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వస్తే వారికి చికిత్స అందిస్తామని ఎస్పీ తెలిపారు.

వామ్మో.. ఆ పని చేసిన నిహారిక కొణిదెల.. త్వరలోనే వీడియో కూడా?

మహేశ్, అనిల్‌ సినిమాలో సూపర్‌స్టార్ పాత్ర ఏంటో తెలుసా?

కండీషన్లతో ఇంటికి చేరిన పుట్ట మధు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -