Thursday, April 25, 2024
- Advertisement -

మహేశ్, అనిల్‌ సినిమాలో సూపర్‌స్టార్ పాత్ర ఏంటో తెలుసా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అయితే ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుందా అంటే అవుననే వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ తీసే సమయంలో అనిల్ రావిపూడి మరొక సినిమా కథను మహేష్ తో చర్చించినట్లు తెలుస్తోంది.

అనిల్ చెప్పిన కథ మహేష్ కు నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అప్పట్లో జోరుగా వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ సమాచారం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర, ఇదివరకే ఒక్కడు సినిమాలో స్టైల్‌లో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.

Also read:తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు క్రికెట్ కోచ్ గా కనిపించనున్నట్లు తాజా సమాచారం.ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రం చేయగా, అనిల్ రావిపూడి ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు మనకు తెలిసిందే.

Also read:నలబై ఏళ్లకు పిల్లలు, భర్త మరణం.. రాత్రి వాళ్ళు అలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -