Thursday, March 28, 2024
- Advertisement -

‘సాగ‌ర్’ ఉప ఎన్నిక నామినేష‌న్ల సందడి!

- Advertisement -

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక నామినేష‌న్ల‌కు ఈ రోజే చివ‌రి రోజు కావ‌డంతో ప‌లు పార్టీల అభ్య‌ర్థుల‌తో పాటు స్వ‌తంత్రులు నామినేష‌న్ దాఖ‌లు చేసేందుకు త‌ర‌లివ‌చ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ నామినేషన్ వేశారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఉన్నారు.  అలాగే, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి కూడా నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

బీజేపీ అభ్య‌ర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ నామినేషన్ వేశారు. కాగా, నిన్నటి వరకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎవరు అన్న విషయం పై టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 20 మందికిపైగా నామినేష‌న్లు వేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జ‌ర‌ప‌నున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 3 వరకు గడువు ఉంది.

ఈ ఎన్నిక‌ వ‌చ్చేనెల‌‌ 17న జ‌రగనున్న విష‌యం తెలిసిందే. 2న ఫలితం వెల్లడ‌వుతుంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

పంజాబ్​ కింగ్స్​ మొత్తం మారిపోయింది.. అవును ఇది చూడండి..!

మరో నెలలో జగన్ మళ్లీ పథకాల వర్షం.. అంతా సిద్దం..!

మాస్క్ లేక పోతే మోత మోగినట్టే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -