Thursday, March 28, 2024
- Advertisement -

మరో నెలలో జగన్ మళ్లీ పథకాల వర్షం.. అంతా సిద్దం..!

- Advertisement -

ఏప్రిల్, మే లో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలపై సమీక్ష చేపట్టారు. కొవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోడానికి విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన క్లినిక్స్‌ నిర్మించి, ఆగస్టు 15న ప్రారంభించాలని చెప్పారు.

9,899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. సెప్టెంబర్‌లో బీఎంసీలను ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. 25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలన్న జగన్.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక యూనిట్‌ ఉంటుందన్నారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటిపట్టా ఇవ్వాలన్నారు. మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కొవిడ్‌ నివారణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎల్లుండి నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటున్నా. వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపట్టడమే మన కర్తవ్యం. వ్యాక్సినేషన్‌ ద్వారానే కొవిడ్‌ సమస్య పరిష్కారం. పరిషత్‌ ఎన్నికలు పూర్తయ్యాక కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెట్టాలి. ఏప్రిల్‌ 1 నుంచి అర్బన్‌ ప్రాంతాల తొలిదశ వ్యాక్సినేషన్‌పై దృష్టి ఉంచాలి. వార్డు, గ్రామ సచివాలయాల యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ చేపట్టాలి’ అని సీఎం జగన్ చెప్పారు.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

స్వల్పంగా తగ్గిన పసిడి.. నిలకడగా వెండి ధరలు!

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -