Thursday, May 8, 2025
- Advertisement -

ది ఫ్యామిలీ మెన్ పై మళ్లీ వివాదం… అమెజాన్ పై సీమాన్ ఫైర్

- Advertisement -

ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరిస్ ఎంత చక్కటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సినిమా రేంజ్ లో ఆకట్టుకుంది. తెలుగు దర్శకులైన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ గత ఏడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి, షరీబ్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ యాక్షన్, డ్రామా వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంది.

తొలిభాగం సక్సెస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ రెండో భాగంగా ది ఫ్యామిలీ మెన్-2 తెరకెక్కింది. అయితే ఇందులో నటి సమంత టెర్రరిస్ట్ గా నటించింది. అయితే ఒక తమిళ నటిని టెర్రరిస్టుగా చూపించడంతో పాటు తమిళుల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని ఈ సిరీస్ లో తప్పుగా చూపించారని వివాదాలు తలెత్తాయి. ఈ వెబ్ సీరిస్ ను విడుదల చేయవద్దని కొద్ది రోజులుగా తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ది ఫ్యామిలీ మెన్ -2 ఈనెల 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి న్యూస్ సాధిస్తోంది.

Also Read: టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

ఈ నేపథ్యంలో మరోసారి ఈ వెబ్ సిరీస్ పై వివాదం రగిలింది. తాజాగా నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ అమెజాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళులకు వ్యతిరేకంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ను ఎలా స్ట్రీమింగ్ చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ నిలిపి వేయాలంటూ ఆయన అమెజాన్ కు ఓ లేఖ రాశారు. ప్రసారాలు నిలిపి వేయకుంటే తమిళులు అంతా అమెజాన్ సంస్థ సర్వీసులను బాయ్ కాట్ చేస్తారని హెచ్చరించారు.

ఒక్క సీమానే కాదు.. ఎండీఎంకే అధినేత వైగో వంటి సీనియర్ రాజకీయ నాయకుడు కూడా ఈ సిరీస్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది వరకే ది ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ వివాదాలు ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -