ఓటీటీలో ఆచార్య విడుదల డేట్ వచ్చేసింది ..

- Advertisement -

మెగా మల్టీస్టార్‌ మూవీగా ప్రపంచవ్యాప్తంగా ఆచార్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌పైకి తెచ్చి కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. పూజా హెగ్డే, సోనూ సూద్ తదితరలు కీలక పాత్రలు పోషించారు.

అమ్మవారు వెలసిన ప్రాంతం.. రాజకీయ నేత చేజిక్కించుకోకుండా సాగే పోరాటం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. మే 20న ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాల్లో ఓటీటీలో ప్రసారం కాబోతోంది.

- Advertisement -

ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికరికంగా ప్రకటించింది. అయితే థియేటర్లలో ఆచార్య అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.. అయితే ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదలంటే..?

ఆ హీరోతో ఎంట్రీ ఇవ్వబోతున్న చిట్టి

ఉన్నోడికి ఫన్.. లేనోడికి ఫ్రస్ట్రేషన్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -