Friday, April 26, 2024
- Advertisement -

కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

- Advertisement -

మన దేశంలో వ్యాక్సిన్​ పంపిణీ ప్రక్రియ ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్​ అయినట్టే. ఎందుకంటే ఇప్పటికే పంపిణీ సరిగ్గా జరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయే తప్ప. వ్యాక్సిన్​ పంపిణీలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. దీంతో వ్యాక్సినేషన్​ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మనదేశంలో పంపిణీ అవుతున్న కోవాగ్జిన్​, కోవిషీల్డ్​ ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతంగా పనిచేస్తుంది? అనేది ప్రజలకు ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఏ వ్యాక్సిన్​ తీసుకుంటే నిశ్చితంగా ఉండొచ్చు. ఏ వ్యాక్సిన్​ తీసుకున్నా మాస్కు పెట్టుకోవాల్సిందే. భౌతికదూరం పాటించాల్సిందే. అయితే ఏ వ్యాక్సిన్​తో రోగనిరోధక శక్తి ఎక్కువగా వస్తుంది? డెత్​ రేట్​ తక్కువగా ఉంటుందన్నదే ప్రశ్న. అయితే కోవాగ్జిన్​ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని.. కోవాగ్జిన్ తో ​ పోల్చి చూస్తే.. కోవిషీల్డ్​ అంత ప్రభావంతంగా పనిచేయడం లేదని తొలుత కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో ప్రజలు కోవాగ్జిన్​ కే మొగ్గు చూపారు.

Also Read: నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ..!

ఇదిలా ఉంటే తాజాగా కోవిషీల్డ్​ బెటర్​ అని ఓ అధ్యయనం అంటోంది. కోవిషీల్డ్​ తీసుకున్న వారికే రోగనిరోధక శక్తి ఎక్కువగా వచ్చిందని సదరు సంస్థ చెబుతున్నది. 515 మందిలో కొవాగ్జిన్​​​, కోవిషీల్డ్​ ఎలా పనిచేస్తుంది? రోగనిరోధకశక్తి ఏ మేరకు అభివృద్ధి చెందింది? అనే అంశం మీద ఓ సంస్థ పరిశోధన జరిపింది.

కోవిషీల్డ్​ తీసుకున్న వారిలో 98.1 శాతం యాంటిబాడీస్ వస్తుండగా.. కోవాగ్జిన్​ తీసుకున్న వారిలో కేవలం 80 శాతం మాత్రమే యాంటీ బాడీస్​ అభివృద్ధి చెందాయి. దీంతో కోవాగ్జిన్​ కంటే కోవిషీల్డ్​ ప్రభావంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కోవాగ్జిన్​ కూడా బాగానే పనిచేస్తున్నప్పటికీ.. కోవిషీల్డ్​తో పోల్చి చేస్తే.. కొంత తక్కువ ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్​ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుబాటులో ఏ వ్యాక్సిన్​ ఉంటే అది తీసుకోవడం బెటర్​ అని శాస్త్రవేత్త ఏకే సింగ్ అంటున్నారు.

Also Read: టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -