Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో ఎప్పుడంటే ..

- Advertisement -

ఒక్క టీజర్ తో అందరూ జనతా గ్యారేజ్ సినిమాకి వీరాభిమానులు అయిపోయారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ, స్క్రీన్ ప్రేజెంస్ కానీ అద్భుతంగా నడిచింది. బలహీనుడికి బలం కోసం ఈ జనతా గ్యారేజ్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు బయట అందరూ పలుకుతున్నారు. ఏఎ సినిమా కి అతిపెద్ద బలం దేవీ శ్రీ ప్రసాద్ అని టీజర్ లోనే అర్ధం అవుతోంది.

దేవీ ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్ టీజర్ లో ఎన్టీఆర్ బలాన్ని పెంచేసింది. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ – దేవీ శ్రీ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చినా గానీ ఈ సినిమా కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. దేవీ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆడియో జూలై 22 న విడుడా చెయ్యడానికి సిద్దం చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఆడియో వేడుక ఉంటుంది. జూ.ఎన్టీఆర్ మెయిన్ లీడ్ గా.. సమంత అండ్ నిత్యా మీనన్ హీరోయిన్లుగా.. మోహన్ లాల్ ఒక ముఖ్యమైన క్యారెక్టర్లో నటిస్తున్న ”జనతా గ్యారేజ్” సినిమాను.. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 12నే విడుదల చేస్తాం అంటున్నారు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్.

Related

  1. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  2. ఎన్టీఆర్ డెడికేషన్ చూసి కొరటాల షాక్!
  3. రాజకీయాలలోకి జూనియర్ ఎన్టీఆర్ ? కొత్త పార్టీ !!
  4. ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -