Sunday, May 19, 2024
- Advertisement -

కెసిఆర్ ఫ్రెండ్ కీ కెసిఆర్ చెప్పింది నచ్చలేదు

- Advertisement -
Akbaruddin Owaisi on Etela Rajender Telangana Budget

తెలంగాణా రాష్ట్రం లో వన్ సైడ్ ఫ్రెండ్ షిప్ నడుస్తోంది. వన్ సైడ్ లవ్ విన్నాం గానీ ఈ వన్ సైడ్ ఫ్రెండ్ షిప్ ఏంటి అనుకుంటున్నారా ? మరే రాజకీయ పార్టీ కూడా ఉండనంత ఉదారంగా కెసిఆర్ మజ్లిస్ విషయం లో ఉంటారు. ఎక్కడా ఆచి తూచి మాట్లాడని కెసిఆర్ మజ్లిస్ వారితో మాట్లాడేటప్పుడు  చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పార్టీ తమకి మిత్ర పక్షం కాకపోయినా మిత్ర పక్షమే అంటూ ఆయన చెప్పేస్తారు. ఎన్నికల్లో వారు పోటీకి ఉన్నా కూడా ఫ్రెండ్ పోటీ నే అని కవర్ చేస్తుంటారు.

మజ్లిస్ మీద కేసీఆర్ ఇంత ప్రేమను ఒలకబోసినా.. మజ్లిస్ మాత్రం తెలంగాణ అధికారపక్షం విషయంలో మాత్రం కరాఖండీగా ఉన్నట్లే కనిపిస్తుంటుంది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాటలే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ఆదాయం సూపర్ గా ఉందంటూ ఆర్థికమంత్రి ఈటెల చెప్పిన వాదనకు అక్బరుద్దీన్ ఏ మాత్రం కన్వీన్స్ కాకపోవటమే కాదు.. ఈటెల చెప్పిన మిగులు మాటలో నిజం లేదన్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం.2014-15 బడ్జెట్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయంలో మిగులు కనిపిస్తున్నా.. 2015-16 లెక్కల ప్రకారం రూ.4వేల కోట్ల లోటు ఉందన్న విషయాన్ని అక్బరుద్దీన్ చెప్పటం గమనార్హం.

ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ.51వేల కోట్లు ఉండగా.. ఆదాయం మాత్రం రూ.47 వేల కోట్లు మాత్రమే ఉందని.. అలాంటప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం ఎలా అవుతుందని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన మెయింటెనెన్స్ ఛార్జీలు ఇప్పటివరకూ చెల్లించలేదని.. రీయింబర్స్ మెంట్ ఫీజులు కూడా ఇవ్వలేదన్న మాటను చెప్పిన అక్బరుద్దీన్.. మైనార్టీలకు ఇస్తున్న షాదీ ముబారక్ కింద కేవలం రూ.30కోట్లు మాత్రమే విడుదలయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వాదనతో తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం కానే కాదని స్పష్టం చేసిన అక్బరుద్దీన్ మాట..ఆయన మిత్రుడు కేసీఆర్ కు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -