Tuesday, April 23, 2024
- Advertisement -

నా శాఖను కేసీఆర్ బదిలీ చేశారని తెలిసింది.. చాలా ఆనందం : ఈటెల

- Advertisement -

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు ఒక్కసారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ నుంచి వైద్య, ఆరోగ్యశాఖను బదిలీ చేశారు. ఈ నేపథ్యంతో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తన శాఖ నుంచి తనను సీఎం తొలగించారని తెలిసిందని… చాలా సంతోషం అని చెప్పారు. అన్ని శాఖలపై ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉన్నాయని… అందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉంటారని చెప్పారు.

వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. అధికారులకు కీలక సూచన!

కాగా, ఈటల రాజేందర్ ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన నేపథ్యంలో ఆ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ స్వయంగా చేపడుతున్నారు. దీనిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కూడా తెలిపారు. ప్రతిరోజు మూడు పర్యాయాలు సమీక్ష చేపట్టాలని, కరోనా పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

కరోనాతో సినీ దర్శకుడు శ్రవణ్ కన్నుమూత!

ఒక పక్కా ప్రణాళికతో ఇదంతా జరుగుతోందని ఈటల వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ తోనే భూకబ్జా ఆరోపణలు చేశారని అన్నారు. అందరు నేతలు ఎన్నికలలో నిమగ్నమైతే… తాను పూర్తిగా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించారనని ఈటల తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మళ్లీ మాట్లాడతానని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -