నాని నవ్వుల హోం మొదలైంది

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి.. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకుని.. తాజాగా సినిమా టీజర్ను విడుదల చేశారు. అందులో నాని పలికిన సంభాషణలు ఆద్యంతం నవ్వు తెప్పించేలా ఉన్నాయి.

‘యువ సుందరుడి నవ్వుల హోమం మొదలైంది’ అనే పోస్టర్తో ‘అంటే సుందరానికి’ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ‘పుట్టినరోజున ఏంటే ఇది.. ఇంకెన్ని హోమాలు చేయాలి… ఇంకో రెండు హోమాలు చేశానంటే గిన్నీస్ బుక్లోకి ఎకొచ్చు.’, ‘బయటకెళ్తే ద్విచక్ర వాహన గండం.. నీళ్లలో దిగితే జలగండం.. నడిస్తే రోడ్డు గండం.. కూర్చొంటే కుర్చీ గండం.. దీనమ్మ గండం..’, ‘చిన్నప్పటి నుంచి హోమాలు చేసి చేసి మొహం పగిలిపోతుంది.’ అంటూ నాని పలికిన డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని-నజ్రియా హీరో హీరోయిన్లుగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బోల్డ్ బ్యూటీ

మరోసారి సెంటిమెంట్ ఫాలోఅవుతున్న త్రివిక్రమ్

మరో సారి రెచ్చిపోబోతున్న నట సింహం

Related Articles

Most Populer

Recent Posts