- Advertisement -
ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలకు ఆస్కార్ షాక్ ఇచ్చింది. థియేటర్లలో కాకుండా కేవలం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ కు నో ఎంట్రీ చెప్పింది. కొవిడ్ ప్రపంచాన్ని వణించిన నేపథ్యంలో సినిమా రంగం కుదేలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. సినిమా రంగాన్ని నమ్మకున్న లక్షలాది మంది రోడ్డున పడ్డారు.
ఆ సమయంలో ఓటీటీ సినిమా నిర్మాతలకు పెద్ద ఊరటగా మారింది. చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే కేవలం ఓటీటీలో రిలీజైన సినిమాలను ఆస్కార్ రేస్ నుంచి పక్కన పెట్టి షాక్ ఇచ్చింది.
దీంతో పాటు మరికొన్ని కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఓ సినిమా నుంచి ఎన్ని పాటలైనా ఇంతకు ముందు పంపే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఒక్కో సినిమా నుంచి మూడు పాటలకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు.
రాకీభాయ్ నెక్స్ట్ మూవీ ఏంటి ?