విక్రమ్ డైరెక్టర్ తో రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ .. బ్లాక్ బాస్టర్ అయ్యాకా రామ్ చరణ్ జోరు పెంచడాడు. వరుసగా మూవీస్ లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే తమిళ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాడు. దీని తర్వాత జెర్నీ దర్శకుడికీ ఓకే చెప్పాడు. తాజాగా మరో తమిళ దర్శకుడి కథను ఓకే చేసినట్లు టాక్.

మాస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లోకేశ్ కనకరాజ్.. త్వరలో రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ విక్రమ్ ను లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ పూర్తైన వెంటనే రామ్ చరణ్ తో మూవీని ట్రాక్ ఎక్కించనున్నాడు. రామ్ చరణ్ ఇలా వరుసగా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఒకప్పుడు ఏ భాష హీరోలు, దర్శకులు.. ఆ భాష తెలిసిన వారితోనే సినిమాలు చేసేవారు. ఎక్కడో కొద్ది మంది తప్ప. కానీ పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్ తెరపైకి వచ్చాకా.. భాషలకు ఎల్లలు చెరిగిపోయాయి. ఇది మంచి పరిణామం అంటున్నారు అభిమానులు.

ఆస్కార్ కీలక నిర్ణయం

కీలక వ్యాఖ్యలు చేసిన అక్షయ్

బాల‌కృష్ణ‌మూవీలో బింధుమాధవి

రాకీభాయ్‌ నెక్స్ట్ మూవీ ఏంటి ?

Related Articles

Most Populer

Recent Posts