బాల‌కృష్ణ‌మూవీలో బింధుమాధవి

ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ గా టైటిల్ సొంతం చేసుకున్న బిందు మాధవి దీనితో పాటు ఓ మూవీ ఆఫర్ కొట్టేసింది. అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అఖండ తర్వాత త్వరలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాల‌కృష్ణ‌ఓ మూవీ చేయబోతున్నారు.

50 ఏళ్ల వ్యక్తిగా ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఇందులో బాల‌కృష్ణ‌కుమార్తెగా శ్రీలీల నటించబోతోంది. అయితే బిగ్ బాస్ ఫైనల్ కు గెస్ట్ గా వచ్చిన అనిల్ రావిపూడి.. బిందుమాధవికి ఓ ఆఫర్ ఇచ్చారు.

తన కోసం ఓ పాత్ర సిద్ధం చేస్తానన్నారు. వీలైతే బాల‌కృష్ణ‌మూవీలోనే ఆ పాత్ర ఉండేలా ట్రై చేస్తానన్నారు. దాంతో బాల‌కృష్ణ‌భార్యగా బిందు మాధవి నటించబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌ 30 ప్రాజెక్టులో ఆ హీరోయిన్

సంక్రాంతికి సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన యంగ్ హీరో

Related Articles

Most Populer

Recent Posts