రాకీభాయ్‌ నెక్స్ట్ మూవీ ఏంటి ?

రాకీభాయ్‌ వాట్ నెక్ట్‌ అంటున్నారు అభిమానులు. కేజీఎఫ్-2తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు యశ్. కేజీఎఫ్ 1 తర్వాత నాలుగేళ్లు తీసుకున్న యశ్.. కేజీఎఫ్-2తో తన రికార్డు తానే బద్దలుకొట్టుకున్నాడు. కేజీఎఫ్-1తో 250 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. పార్ట్ టూతో ఏకంగా 1200 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకున్నాడు. దీంతో కేజీఎఫ్-3తో యశ్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే కేజీఎఫ్ 1,2 తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీ అయ్యారు. ముందుగా ప్రభాస్‌తో సలార్, తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సలార్ విడుదల కానుంది. ఆ తర్వాత ఏడాదికి ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ సినిమా విడుదల కాబోతోంది. అంటే ఈ రెండు చిత్రాలకు దాదాపు మూడేళ్లు పట్టేస్తుంది.

ఆ తర్వాతే కేజీఎఫ్‌-3ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. మరి అప్పటి దాకా రాకీ భాయ్ వెయిట్ చేస్తాడా ? ఈ లోపు మరేదైనా చిత్రం ఒప్పుకుంటాడా అన్నది సస్పెన్స్‌గా మారింది.

ఎన్టీఆర్‌ 30 ప్రాజెక్టులో ఆ హీరోయిన్

పాన్ ఇండియా మూవీగా బాలయ్య అఖండ సీక్వెల్

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన యంగ్ హీరో

Related Articles

Most Populer

Recent Posts