Monday, April 29, 2024
- Advertisement -

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లీకుల రాయుళ్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. స్టార్ హీరోల నుంచి.. చిన్నా చితక హీరోల వరకు.. వారి సినిమాకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను లీక్ చేస్తున్నారు. లీకుల బెడద నుంచి విముక్తి పొందడానికి దర్శక నిర్మాతలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. లీకులకు మాత్రం అడ్డుకట్ట వేయకపోతున్నారు.

ఈ మధ్యన సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి లీకులు ఓ రేంజ్ లో అవుతున్నాయి. దాంతో పాటుగా దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి కూడా తాజాగా ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుపాటిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ చిత్రం నుంచి తాజాగా ఓ ఫోటోను లీక్ చేసారు లీక్ రాయుళ్లు.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కానీ.. వీడియో కానీ లీక్ అవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి.. దూరంగా ఓ వ్యక్తి గోడను దూకుతుంటే.. అతని వెనక వైపు పవర్ స్టార్ ఉంటే.. పవన్ వెనకే లాటీలు పట్టుకుని పోలీసులు కనిపిస్తున్నారు. ఈ ఫోటో పవన్ సినిమాపై అభిమానులకు మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -