Thursday, March 28, 2024
- Advertisement -

బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న భీమ్లానాయక్

- Advertisement -

టాలీవుడ్‌ను షేక్ చేసిన భీమ్లానాయక్.. బాలీవుడ్‌ను అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. పవన్ కల్యాణ్​, రానాలు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత నెల 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. తాజాగా హీందీ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​.

తెలుగులో మాదిరిగానే హిందీలోనూ పవర్​ ఫుల్​ డైలాగ్స్​ ఉండటం విశేషం. ఇటీవలి కాలంలో తెలుగు యాక్షన్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో.. దాదాపు పెద్ద సినిమాలన్నీ హిందీలో డబ్బ్ అవుతున్నాయి. హిందీలోనూ విడుదలైన పుష్ప మూవీ అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు భీమ్లా నాయక్​ తెలుగులో సృష్టించినట్లుగానే.. రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఈ మూవీ హిందీలో ఎప్పుడు విడుదల అవుతుంది? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. హిందీ చిత్రాన్ని బి4యూ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్​ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు ఎలా ఉందంటే ?

మహా మాయగాడి ఉచ్చులో బాలీవుడ్ భామలు

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -