Monday, May 13, 2024
- Advertisement -

పవన్ ను బావ అంటున్న మానస హిమవర్ష!

- Advertisement -

తెలుగులో చేసింది ఒకే సినిమా. ఆ సినిమాతో ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ.. ఇప్పుడు ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బావ అంటుంది. మరి పవన్ ను బావ అన్నది ఎవరు? అసలు పవన్ ఆమెకు ఎలా అయ్యారు? అంటే ముందు ఆమె గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె తెలుగమ్మాయి పేరు మానస హిమవర్ష. ఈ భామ బస్ స్టాప్ అనే సినిమాలో నటించింది.

కాకపోతే ఈ సినిమాతో పెద్దగా పేరు రాలేదు. అయితే ఈ భామ పవన్ ను బావ ఎందుకంటోందంటే.. పవర్ స్టార్ తదుపరి చిత్రం కాటమరాయుడులో ఈ భామ కూడా ఓ పాత్ర పోషిస్తోంది. నిజానికి సినిమాలో ఐదుగురు తమ్ముళ్లకు అన్నగా నటిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇక, అతడికి సినిమాలో ఇద్దరు సొంత మరదళ్లతో పాటు ఓ కజిన్ మరదలు కూడా ఉంటుందట.

ఆ కజిన్ మరదలు పాత్రలోనే మానస నటిస్తోంది. అందుకే ఆమె పవన్ ను బావ అనేస్తోంది. ఇక, పవన్ కు ఇద్దరు తమ్ముళ్లుగా విజయ్ దేవరకొండ, రవివర్మలు కన్ఫర్మ్ అయ్యారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మిస్తున్నారు. 

Related

  1. పవన్ ఖర్చు విషయాలు తెలిస్తే.. షాక్ కావాల్సిందే!
  2. చిరు 151 కోసం బోయపాటి ఓకే ? పవన్ కళ్యాణ్ సినిమా మరి ?
  3. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!
  4. పవన్ తో యామిని భాస్కర్ రొమాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -