Thursday, May 9, 2024
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ.. హద్దు దాటితే కేసులే..

- Advertisement -

తెలంగాణ‌లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాత్రి పూట క‌ర్ఫ్యూ విధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు రాత్రి పూట క‌ర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా నైట్ క‌ర్ఫ్యూ నేటి నుంచే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ఈ నెల 30 వ‌ర‌కు ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, దుకాణాలు, హోట‌ళ్ల‌ను మూసి వేయాల‌ని చెప్పింది. క‌ర్ఫ్యూ నుంచి ఆసుప‌త్రులు, ఫార్మ‌సీలు, ల్యాబ్‌లు, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మిన‌హాయింపు ఇచ్చింది. అలాగే, మీడియా, పెట్రోల్ బంక్, ఐటీ సేవ‌ల‌కు అనుమ‌తి ఇచ్చింది.

విద్యుత్, కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ వంటి సంస్థ‌లు య‌థాత‌థంగా కార్య‌కలాపాల‌ను జ‌రుపుకోవ‌చ్చు. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 18 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్‌ బారిన పడ్డారు.

మాస్ మహరాజ దర్శకుడికి కరోనా పాజిటీవ్!

తెలంగాణలో కరోనా కలకలం.. 6 వేలకు చేరువలో కేసులు!

సాగర్ సభతో కరోనా కలకలం..నోముల భగత్‌కు కరోనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -