Thursday, May 2, 2024
- Advertisement -

బాలయ్య షోకు పవన్.. కాంట్రవర్సీకి తెరదించుతారా ?

- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ” ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ” కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సినీ సెలబ్రేటీలతో పాటు పోలిటికల్ లీడర్స్ ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఈసారి నేషనల్ స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేయనున్నాడు బాలయ్య.. ఇప్పటికే ఆ ఎపిసోడ్స్ కు సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. బాలయ్య ఎనర్జీటిక్ క్వశ్చన్స్ కు ప్రభాస్ ఎలాంటి సమాధానాలు చెబుతాడో అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ తో పాటు మ్యాచో హీరో గోపిచంద్ కూడా షో కు రానున్నారు.

దీంతో ఈ ఇద్దరు బాలయ్యతో చేసే హంగామా ఎలా ఉంటుందో అని అందరి చూపు ఆన్ స్టాపబుల్ పై పడింది. ఇదిలా ఉంచితే ఈ టాక్ షో కు తరువాత రాబోయే గెస్ట్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తరువాత రాబోయే గెస్ట్ గురించి హింట్ ఇస్తూ గత ఎపిసోడ్ లో బాలయ్య త్రివిక్రమ్ కు పోన్ చేసినప్పటికీ కన్వర్జేషన్ ను గ్లిమ్స్ లో ఉంచింది ఆహా టిమ్. బాలయ్య త్రివిక్రమ్ తో మాట్లాడుతూ ” ఆన్ స్టాపబుల్ షో ఎవరితో రావాలో తెలుసుగా.. ” అంటాడు. దీంతో బాలయ్య.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించే చెప్పడానే టాక్ నడుస్తుంది. ఎందుకంటే త్రివిక్రమ్- పవన్ కల్యాణ్ మద్య ఏ స్థాయిలో స్నేహబంధం ఉందో అందరికీ తెలిసిందే.

కాబట్టి తరువాతి గెస్ట్ కచ్చితంగా పవన్ కల్యాణ్ అనే చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఒకవేళ పవన్ బాలయ్య షోకు వస్తే.. ఆ కాంబినేషనే అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమనే చెప్పాలి. ఇక గతంలో పవన్ పై బాలయ్య పలుమార్లు సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు నాగాబాబు కలుగజేసుకొని బాలయ్యపై హాట్ హాట్ కామెంట్స్ కూడా చేశారు. దాంతో అదొక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఒకవేళ బాలయ్య టాక్ షో కు పవన్ వస్తే.. అటు పోలిటికల్ గాను, ఇటు మూవీస్ పరంగాను ఏమైనా కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారా ? ఒకవేళ అడిగితే వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి బాలయ్య షో కు నిజంగానే వస్తాడా లేదా అనేది. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

విక్రమ్ ” రోలెక్స్ ” ఫుల్ మూవీ.. పూనకాలే !

పుష్ప 2.. సుక్కు నయా ప్లాన్ ?

అక్కినేని హీరోలకు స్టార్ డమ్ వస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -