Friday, May 3, 2024
- Advertisement -

ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్.. ఈసారి వినకపోతే అంతే !

- Advertisement -

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గట్టిగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసిన జగన్.. ఈసారి అంతకుమించి అనేలా ఏకంగా 175 స్థానాల్లోను వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి గెలిస్తే రాబోయే ముప్పై ఏళ్లవరకూ తానే అధికారంలో ఉండవచ్చని జగన్ ఆలోచన. కాగా ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రానున్నాయి. దాంతో అనుకున్న టార్గెట్ రిచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే జనాల దృష్టి వైసీపీ పై ఉండేలా చూసుకోవాలనేది వైఎస్ జగన్ ప్రణాలికగా తెలుస్తోంది. అందుకే నిత్యం ప్రజల్లో ఉండాలంటూ ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలకు సూచిస్తున్నారు. .

ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ” గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని నేతలకు దిశ నిర్దేశం చేస్తున్నారు. అయితే నేతలు మాత్రం ” గడప గడపకు మనప్రభుత్వం ” కార్యక్రమంపై పెద్దగా ఆసక్తికనబరచడం లేదు. దాంతో ఆ మద్య ఎమ్మెల్యేలతో జరిగిన బేటీలో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ” గడప గడపకు మన ప్రభుత్వం ” పై నిర్లక్ష్యం మానుకోవాలని కచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని, వారి అభిప్రాయాలూ సేకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించాలని జగన్ సూచించారు.

అయితే అధినేత హెచ్చరించినప్పటికి ఎమ్మెల్యేల తీరులో ఏ మార్పు కనిపించలేదని తెలుస్తోంది. అందుకే తాజాగా జరిగిన సమీక్షలో మరోసారి ఎమ్మెల్యేల తీరుపై సి‌ఎం జగన్ గట్టిగానే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం వహిస్తే ఈసారి కఠిన చర్యలు తప్పవని, యాక్టివ్ గా లేని ఎమ్మెల్యేల స్థానంలో వచ్చే ఎన్నికలలో కొత్తవారికి ఛాన్స్ ఇస్తామని అధినేత గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, ఇకపై నిర్లక్ష్యాం వదిలి ప్రజల్లో ఉన్నవారికే ప్రదాన్యత అంటూ చెప్పకనే చెప్పారట వైఎస్ జగన్. అనుకున్న టార్గెట్ 175 క్లీన్ స్వీప్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని మరోసారి కుండబద్దలు కొట్టేశారట. మరి లక్ష్య చెదన కోసం శతవిధాల ప్రయత్నిస్తున్న జగన్ కు.. ప్రజలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

బి‌ఆర్‌ఎస్ వైరస్.. బీజేపీ వ్యాక్సిన్ !

వాలెంటిర్లపై.. టీడీపీ ఫోకస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -