Sunday, April 28, 2024
- Advertisement -

రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!

- Advertisement -

ఒక సినిమా మొదలు పెట్టాం అంటే.. అది మూడు నెలలలు నుంచి ఆరు నెలలు సమయం పడుతోంది. కొన్ని సినిమాలు అయితే ఏడాది పడుతుంది. ఇంకా అదే పాత్రని రెండేళ్లపాటు నటిస్తూ ఉండాలంటే ఎవరికైనా చిరాకు రావడం ఖాయం. ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే బాహుబలి  సినిమా చిత్రీకరణ మూడేళ్ళుగా జరుగుతునే ఉంది.

ఆ చిత్ర బృందంలో ఎవరికీ విసుగు రాదు. ఎందుకు రాదో.. ఆ రహస్యాన్ని అనుష్క బయటపెట్టింది. అనుష్క ఈ చిత్రంలో దేవసేన పాత్ర లో నటించింది. రెండు పార్టుల్లోనూ ఈమెది కీలక పాత్ర. ఈ చిత్రం షూటింగ్ గురించి ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఒత్తిడి అనిపించదు. ఎందుకంటే ఆ షూటింగ్ జరిగే ప్రాంతం ఇంటి వాతావరణాన్ని తలపిస్తుంది. రాజమౌళి భార్య రమ, ఆమె సిస్టర్ వల్లి అక్కడే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమైనా బాగాలేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు.

నిద్ర పోవడానికి, మెడిటేషన్ చేయడానికి వసతులు ఉంటాయి. అందుకే బాహుబలి షూటింగ్ మరో నాలుగేళ్లు జరిగినా నేను ఒత్తిడిగా ఫీల్ కాను ” అని అనుష్క చెప్పింది. అంతేకాదు దర్శకుడి మంచితనం గురించి తెలుపుతూ… షూటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి మాటను రాజమౌళి  గౌరవిస్తారు. సలహాలను స్వీకరిస్తారు. సెట్ బాయ్ చెప్పిన విషయం గురించి కూడా డైరక్టర్ టీమ్ మొత్తం ఆలోచిస్తుంది. అతను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే.. దాని కూడా పాటిస్తారు అని స్వీటీ చెబుతోంది.

Related

  1. అనుష్క పెళ్లి చేసుకునేది ఇతనినే?
  2. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  3. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  4. అనుష్క అదరహో .. కొత్త లుక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -