- Advertisement -

ఒకే సినిమా.. ముగ్గురు స్టార్ హీరోలు!

- Advertisement -

హీరోలు ఇతర హీరోల సినిమాలో గెస్ట్ రోల్స్ చేయడం మాములే. అయితే ఓ ముగ్గురు స్టార్ హీరోలు  ఒకేసారి గెస్ట్ రోల్స్ చేయడం అనేది ఆసక్తికరమైనదే. నాగచైతన్య నటిస్తున్న ప్రేమమ్ చిత్రంలో నాగార్జున, వెంకటేశ్ గెస్ట్ రోల్స్ చేశారు. ఇదికాకుండా… త్వరలోనే రాబోతున్న ఓ భారీ సినిమాలో ఏకంగా ముగ్గురు యంగ్ స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారట.

ఆ యంగ్ స్టార్ హీరోలు ఎవరో కాదు… వాళ్లే రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య. అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా బ్యానర్ పై అతి త్వరలో సావిత్రి అనే సినిమా రాబోతుంది. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంకు దర్శకత్వం వహించనున్నారు. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో లీడ్ రోల్ చేసేందుకు నిత్యామీనన్ అంగీకరించింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే సినిమా పరంగా చూస్తే… అలనాటి మేటి నటి సావిత్రి… అక్కినేని, ఎన్టీఆర్ లాంటి లెజెండ్స్ తో నటించింది. ఆ పాత్రలను ఇప్పటి ఎన్టీఆర్, నాగచైతన్య లాంటి హీరోలతో చేయించాలనే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత. ఇదే కనుక నిజం అయితే ఫ్యాన్స్ కి పెద్ద పండగే. త్వరలోనే దీనిపై ఓ క్లారీటీ రానుంది.

Related

  1. రామ్ చరణ్ తో ప్రభాస్!
  2. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  3. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!
  4. బాహుబలి ఆ ? హాహాహ అంటున్న నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -