Thursday, May 2, 2024
- Advertisement -

‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కళ్యాన్ పోరాటాలు.. ఫోటోలు వైరల్!

- Advertisement -

పవన్ కళ్యాన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రిమేక్ వకీల్ సాబ్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు పవన్ కళ్యాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో.. త్వరలో అలాగే చూడాలనుకుంటున్నారు. 17వ శతాబ్దం నాటి ఇతివృత్తంతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ భామ జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఇందులో ఓ కీలకపాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైటింగ్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పలు పోరాట రీతులను సాధన చేస్తున్నారు. స్టంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షణలో హర్ష్ వర్మ అనే షావోలిన్ యోధుడితో కలిసి బల్లెం ఉపయోగించి పోరాడడంపై శిక్షణ పొందుతున్నారు.  తాజాగా బల్లెంతో పవర్ స్టార్ కసరత్తులు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

నాగ్ కోసం చిరు చికెన్ తో ప్రత్యేక వంట.. ఫోటో వైరల్!

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

‘ఆర్ఆర్ఆర్’ అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -