Friday, April 26, 2024
- Advertisement -

ఇలా అయితే ఎలా? ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

- Advertisement -

ఈ నెల 8న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఏపీలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిల‌ను పూర్తి చేయాల‌ని కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 8న ఎన్నిక‌, 10న ఓట్ల లెక్కింపు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పరిషత్ ఎన్నికలపై తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అఖిలపక్ష సమావేశానికి ముందుగా నోటిఫికేషన్ విడుదల చేశారని, రాజకీయ పార్టీలు ప్రజస్వామ్యాన్ని అవమానించారని అసహనం వ్యక్తంచేశారు. 

ఏపీలో రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని, నిబంధనలు పక్కన పెట్టి మరీ ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. టీడీపీ ఎన్నికలు కొత్త కాదని, తాము ఎన్నికలంటే భయపడడంలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రజలకు అర్థం కావాలనే తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 2014లో 16,589 ఎంపీటీసీలకు గాను 346 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, అంటే 2 శాతం అని వివరించారు.

అయితే ఇప్పుడు 9,696 స్థానాలకు 2,362 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, అంటే 24 శాతం అని పేర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. దీనిపై మాజీ ఎస్ ఈసీ గవర్నర్ కు లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌న్న‌ది క‌ఠిన నిర్ణ‌య‌మే అయినా… త‌ప్ప‌టం లేద‌ని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం లేద‌నే ఈ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

నేటి పంచాంగం, శుక్రవారం (2-4-2021)

నాగ్ కోసం చిరు చికెన్ తో ప్రత్యేక వంట.. ఫోటో వైరల్!

‘ఆర్ఆర్ఆర్’ అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -