నాగ్ కోసం చిరు చికెన్ తో ప్రత్యేక వంట.. ఫోటో వైరల్!

- Advertisement -

టాలీవుడ్‌లో చాలా మంది నటుల మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉంటుంది. కొంద‌రైతే ప్రాణ స్నేహితుల్లా మెలుగుతారు. ఒకరి ఫంక్షన్లకు మరొకరు వెళ్లి సందడి చేస్తుంటారు. తాజాగా వైల్డ్‌డాగ్ ప్రమోష‌న్‌లో బిజీలో ఉన్నారు కింగ్ నాగార్జున. స్నేహితుడు నేరుగా ఇంటికొచ్చి స‌ర్‌ప్రైజ్ ఇస్తే చిరు ఆయన కోసం తానే స్వయంగా చికెన్ వండి నాగ్ ని మెప్పించారు. చిరంజీవి, అక్కినేని నాగార్జున‌కున్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఈ ఇద్ద‌రూ చాలా ఈవెంట్స్ క‌లిసి జ‌రుపుకుంటారు. ఒక‌రి సంతోషాన్ని మ‌రొక‌రితో షేర్ చేసుకుంటారు. వైల్డ్ డాగ్ ప్రమోషన్ లో భాగంగా చిరు ఇంటికి వెళ్లారు నాగార్జున. ఈ సందర్భంగా తాను వండిన‌ చికెన్ లెగ్ పీస్‌ల‌ను నాగార్జున‌కు రుచి చూపించాడు. వైల్డ్ డాగ్ విడుద‌ల నేప‌థ్యంలో నా టెన్ష‌న్ ను కూల్ చేసేందుకు డిన్న‌ర్ కోసం మెగాస్టార్ డెలీసియస్ వంట‌కం త‌యారు చేశార‌ని నాగార్జున ట్విట‌ర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేశాడు.

- Advertisement -

అద్భుత‌మైన సాయంత్రాన్ని అందించిన మెగా దంప‌తుల‌కు నాగార్జున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. ఇటీవ‌ల చిరంజీవి వైల్డ్ డాగ్ ట్రైల‌ర్ ను లాంఛ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -