Friday, April 26, 2024
- Advertisement -

అసోంలో బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం తరలింపు.. నలుగురు ఈసీ అధికారులపై వేటు!

- Advertisement -

సాధారణంగా పోలింగ్ అయిపోయాక ఈవీఎంలను అధికారిక వాహనంలో తీసుకెళ్లాలి. కానీ, ఓ బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్లడం ఇప్పుడు అసోంలో సంచలనం సృష్టిస్తోంది. అసోంలో గురువారం రెండో విడత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే కరీంగంజ్ జిల్లాలోని రతాబరి నియోజకవర్గంలో ఓటింగ్ పూర్తైన తర్వాత ఓ పోలింగ్ కేంద్రం నుంచి ఈవీఎం‌ను బీజేపీ ఎమ్మెల్యే కారులో స్ట్రాంగ్ రూమ్ కి త‌ర‌లించడం వివాదాస్పదమవుతోంది.

ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కారులో తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన ప్రతిపక్ష నేతలు.. వెంటనే కారును ఆపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం.. నిజనిర్ధారణ నివేదికను విడుదల చేసింది. ఘటనకు బాధ్యులైన నలుగురు ఎన్నికల అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వ కారు బ్రేక్ డౌన్ అయిందని, అప్పటికే వాతావరణం బాగాలేకపోవడం, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడంతో అటుగా వచ్చిన వాహనాన్ని లిఫ్ట్ ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్‌‌లకు తరలించారు.

దాని యజమాని ఎవరు అనేది పరిశీలించకుండా వాహనంలో ఎక్కారు. అయితే, ఆ కారు పథార్కండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణేందు పాల్ భార్య మధుమితా పాల్ కి చెందినది. స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఈవీఎంను చేర్చిన వాహానాన్ని బీజేపీ నేత భార్యదిగా గుర్తించిన ప్రతిపక్ష కార్యకర్తలు దాడిచేశారు. దోళనకారులను చెదరగొట్టడానికి భారీగా బలగాలను రప్పించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

వాహనంలోని సిబ్బందిని పోలీసులు సురక్షితంగా తరలించారు.కాగా, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రాతాబరిలోని పోలింగ్ బూత్ నెంబర్ 149లో రీపోలింగ్ నిర్వహించాలని శుక్రవారం ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులపై నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కళ్యాన్ పోరాటాలు.. ఫోటోలు వైరల్!

ఇలా అయితే ఎలా? ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: చంద్రబాబు

నాగ్ కోసం చిరు చికెన్ తో ప్రత్యేక వంట.. ఫోటో వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -