Friday, March 29, 2024
- Advertisement -

పవర్ స్టార్ అభిమానులకు పండుగే

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూసిన క్షణం రానేవచ్చేసింది. ట్రైలర్ రూపంలో భీమ్లానాయక్ అభిమానులను అలరించేందుకు వచ్చేశాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది.

ట్రైలర్‌లో పవన్ కల్యాణ్.. రానా పలికిన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ‘ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావు..’ అనే రానా డైలాగ్‌తో ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్వు స్లోగానే పోనియ్యి. డాని.. డానియెల్ శేఖర్.’ అంటూ రానా చెప్పే డైలాగ్… బుల్లెట్ బైక్‌పై నుంచి దిగుతూ.. ‘సర్హద్ భీమ్లా నాయక్.. సబ్ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహశీల్.. శ్రీశైలం మండలం, ఆంధ్రప్రదేశ్..’ అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్ అని చెప్పొచ్చు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తివ్రిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 25న భ్లీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజ‌శేఖ‌ర్ ను సినిమా నుంచి ఎందుకు త‌ప్పించారు ?

మహేశ్ బాబు తల్లిగా అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ?

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -