Thursday, May 2, 2024
- Advertisement -

’హరిహర వీరమల్లు‘గా రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ !

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న సినిమా రాబోతుంది అని తెలిసినా.. ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నా.. విడుద‌ల‌కు సిద్ధం అయినా.. ఇలా ప్ర‌తీ విష‌యాన్ని సినీ ప్రేమికులు ఎంతో జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప్ర‌తీ విష‌యాన్ని పండ‌గ‌లా చేసుకుంటారు. సోష‌ల్ మీడియాలో హీట్ పుట్టిస్తారు.

ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంద‌ని తెలిసిందే. ఈ సినిమాకు ఎ.ఎమ్‌.రత్నం నిర్మాత. అయితే ఇన్ని రోజులు ఈ సినిమాకు పేరు ఖ‌రారు కాలేదు. కానీ ఇప్ప‌డు ఈ సినిమాకు పేరు ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి హరి హర వీరమల్లు అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం.

త్వరలోనే ఈ సినిమా యూనిట్ దీనికి సంబంధించిన‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పవన్‌ 27వ సినిమాగా వ‌స్తున్న దీనికి విరూపాక్ష అనే పేరు కూడా ప్ర‌చారంలో ఉంది. కానీ ఈ మూవీ యూనిట్ హరి హర వీరమల్లు అనే పేరునే ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్ న‌టించ‌నుంది. అలాగే బాలీవుడ్‌ భామ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ కూడా ఒక మంచి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఈయ‌నే స‌లార్ విల‌న్.. ఇక సినిమా మాములుగా ఉండ‌దు!

హీరో సూర్యకు కరోనా..

ఆస‌క్తిని పెంచుతున్న ప‌వ‌న్ పీరియాడిక్ మూవీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -