Monday, May 6, 2024
- Advertisement -

హీరో సూర్యకు కరోనా..

- Advertisement -

సూర్య ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హీరో. ఆయ‌న సినిమాలే కాదు.. ఆయ‌న వ్య‌క్తిత్వం కూడా ఎంతో గొప్ప‌ది. అభిమానులు ప్రేమ‌తో త‌న కాళ్ల‌ను మొక్కితే తిరిగి వాళ్ల కాళ్ల‌ను మొక్కడంటే అయ‌న త‌న అభిమానుల‌ను ఎంత ప్రేమిస్తాడో అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగు, త‌మిళ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియా మొత్తంలో ఆయ‌న‌కు మంచి క్రేజ్ ఉంది.

అయితే ఈ హీరో అభిమానుల‌కు ఇప్పుడో బ్యాడ్ న్యూస్. హీరో సూర్య‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాత ద్వారా తెలిపాడు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని, దీన్ని వైద్యులు నిర్ధారించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నాడు. అలాగే త‌ను క‌రోనాతో బాధ‌ప‌డుతున్నాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతానికి డాక్ట‌ర్ల‌ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపాడు.

అలాగే ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు పేర్కొన్నాడు.గత కొద్ది రోజులుగా ఆయ‌న‌ను కలిసిన వారంతా తగు జాగ్రత్తలు తీకోవాల‌ని కోరారు. కరోనా టెస్ట్ ల‌ను చేయించుకోవాల్సింది సూచించాడు. బయట పరిస్థితులు ఇంకా సాధారణ పరిస్థితి రాలేదనే ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. దీన్ని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించాడు. త‌న‌కు చికిత్స చేస్తున్న డాక్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. కాగా, హీరో సూర్య ట్వీట్‌కు రియాక్ట్ అయిన సినీ అభిమానులు త్వరగా ఆయ‌న‌ కోలుకోవాలని కోరుకుంటున్నారు.

విజ‌య్‌తో రోమాన్స్ చేసేదెవ‌రో ?

స‌మంత వెబ్ సిరీస్ మ‌ళ్లీ వాయిదా

ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డిపోయిన కియారా? హాట్ ఫొటోస్ తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -