Tuesday, April 23, 2024
- Advertisement -

వకీల్​సాబ్​ టీవీలోకి వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

- Advertisement -

రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ హీరోగా నటించిన వకీల్​ సాబ్​ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్​లో విజయం సాధించిన పింక్​ మూవీ రీమేక్​ వకీల్​సాబ్​. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా ఈ కథలో అనేక మార్పులు చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. దీంతో ఈ మూవీ ఇక్కడ సంచలన విజయం సాధించింది.

లాంగ్ బ్రేక్​ తర్వాత పవర్​ స్టార్​కు సూపర్ సక్సెస్​ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఓటీటీ అమేజాన్​ ప్రైమ్​లో ఈ సినిమా విడుదలైంది. డిజిటల్ ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి మంచి రెస్సాన్స్​ వచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై అభిమానులను అలరించడానికి వకీల్ సాబ్ టీవీలో ప్రసారం కాబోతున్నది. అతి త్వరలోనే జీ తెలుగులో ఈ చిత్రం ప్రసారం కాబోతున్నదట. ఈ మేరకు జీ తెలుగు ఓ ట్వీట్ చేసింది.

‘గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు’ అంటూ జీ తెలుగు ట్వీట్ చేసింది. అయితే ఈ మూవీ ఏ తేదీన ప్రసారం చేస్తారు? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి థియేటర్లలో కలెక్షన్లు కొల్లగొట్టిన వకీల్​ సాబ్​.. త్వరలోనే టీవీ ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడన్నమాట. ఈ సినిమాలో వీక్షించేందుకు టీవీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read

సోనూ సూద్​ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..! ప్లాన్ చేసిన కొరటాల..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

అల్లు వారబ్బాయి మెడకు ఏమైయింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -