Saturday, April 27, 2024
- Advertisement -

తమిళనాడు గవర్నర్​గా రవిశంకర్​ ప్రసాద్​

- Advertisement -

బీజేపీ నేత రవిశంకర్​ ప్రసాద్​ తమిళనాడు గవర్నర్​గా నియమించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే కేంద్ర న్యాయశాఖ పదవికి రవిశంకర్​ ప్రసాద్​ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు తాజాగా గవర్నర్​గా అవకాశం వచ్చింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో రవిశంకర్​ ప్రసాద్​ తన పదవికి రాజీనామా చేశారు.

ఎంతో సమర్థుడైన వ్యక్తి, సీనియర్​ నేత అయిన రవిశంకర్​ ప్రసాద్​ను మంత్రివర్గం నుంచి తప్పించడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన కొంతకాలంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్​తో గట్టిగా ఫైట్​ చేస్తున్నారు. ట్విట్టర్​కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవిశంకర్​ ప్రసాద్​ రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం తమిళనాడు గవర్నర్​గా భన్వరీలాల్​ పురోహిత్​ వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. తమిళరాజకీయాలు ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో రాజకీయంగా ఎంతో యాక్టివ్​గా ఉండే రవిశంకర్​ ప్రసాద్​ను అక్కడికి పంపించడం వెనక బీజేపీ వ్యూహం ఉండొచ్చన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read

చిన్న తల ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు..!

బ్యాట్‌ పట్టి క్రికెట్ ఆడిన సీఎం వైయస్‌ జగన్‌

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -