Friday, April 26, 2024
- Advertisement -

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

- Advertisement -

సోషల్ మీడియా నటీనటులను.. ప్రేక్షకులకు ఎంతగానో చేరువ చేస్తోంది. ఒకప్పుడు తమ అభిమాన నటుడు, నటి గురించి తెలుసుకోవాలంటే ప్రేక్షకులు పత్రికలపై, సినీ మ్యాగజైన్స్ పై ఆధారపడేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లు వచ్చిన తర్వాత నటీనటులు తమ అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. నటులు తమకు సంబంధించిన సినిమా విశేషాలు, వ్యక్తిగత విషయాల గురించి నేరుగా అభిమానులతో మాట్లాడటమే కాకుండా తమ తాజా సినిమాలకు సంబంధించిన కబుర్లు చెబుతున్నారు. ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ద్వారా సినిమా ప్రచారం కూడా మరింత సులువుగా మారింది.

అయితే ఇదే సోషల్ మీడియా ద్వారా నటీనటులకు ఇటీవల వేధింపులు కూడా పెరిగిపోయాయి. ఒక హీరో అభిమాని మరో హీరోను తిట్టడం, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప.. అని తిట్టుకోవడం.. అందులోకి తమ అభిమాన నటులను లాగడం, నటీనటులు ధరించే దుస్తులు, వారి వ్యక్తిగత జీవితంలో జరిగే సంఘటనలపై కూడా కలగజేసుకుని తిట్టడం, విమర్శించడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

సోషల్ మీడియా నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేక ఇటీవల నటులు శ్రీకాంత్, శివబాలాజీ, పృథ్వీ,సింగర్ మధు ప్రియ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూ సూద్ అంతలా సాయం చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ.. చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలను కూడా టార్గెట్ చేసి వేధిస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ తమిళ నటి తన కుమారుడిని ముద్దాడుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. బిడ్డకు లిప్ కిస్ ఇవ్వడం ఏంటని తిట్టి పోశారు. తల్లీ బిడ్డ బంధంలో కూడా కొందరు బూతు వెతుకుతున్నారు.

ఇలా నటీనటుల జీవితంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా తనను యూట్యూబ్ వేదికగా తిడుతున్నారంటూ హైదరాబాద్ సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ పై కేసు పెట్టారు. యూట్యూబ్ వేదికగా కొందరు మోహన్ బాబు ను టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మోహన్ బాబు తరపు లీగల్ అడ్వైజర్ సంజయ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు యూట్యూబ్ ఛానల్ లో మోహన్ బాబు ను వ్యక్తిగతంగా ధూషిస్తున్నారని, బూతులు తిడుతూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -