Tuesday, May 21, 2024
- Advertisement -

కాటమరాయుడు ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చి సినిమాలతో బిజీగా మారనున్నాడు. నేడు పవన్ తాజా చిత్రం కాటమ రాయుడు షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈనెల 24 నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటాడు. శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపాల..గోపాల ఫేమ్ కిషోర్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

ఇటీవల రాజకీయాలతో బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటిని కొద్దిరోజులు పక్కనపెట్టి సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.బాడీ ఫిట్ నెస్ కోసం పవన్ జిమ్ లో తెగ కష్టపడిపోతున్నాడు. ఈ చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యం లో తెరకెక్కనుంది. ఇప్పటికే టైటిల్ లోగోని చిత్ర టీం విడుదల చేసింది. దసరాకి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది.

Related

  1. కాటమరాయుడు కోసం పవన్ ఏం చేస్తున్నాడంటే?
  2. పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకో
  3. నేను పెట్టిన టీ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రాణం – రేణూ దేశాయ్
  4. 200 కోట్లు ఇస్తా అంటే ఒద్దన్న పవన్ కళ్యాణ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -