Tuesday, May 21, 2024
- Advertisement -

ఫేస్ బుక్ ద్వారా లక్షలు వెనకేసిన యువకుడు!

- Advertisement -

మీరు చదువుతుంది నిజమే… ఆ యువకుడు ఫేస్ బుక్ ను ఇప్పటివరకు ఉపయోగించి రూ.30.85 లక్షలను సంపాధించాడు. అసలు అంతా డబ్బు ఎలా సంపాధించాడు అనుకుంటున్నారా? అయితే అతని గురించి తెలుసుకోవాల్సిందే.  అతని పేరు అరుణ్ ఎస్ కుమార్. 20ఏళ్ళ అరుణ్ కేరళ లోని ఛత్తనూర్ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మాములుగా ఫేస్ బుక్ లో అందరూ తమ ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఉంటారు. కానీ అరుణ్ కుమార్ మాత్రం అందరికి బిన్నంగా ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. అరుణ్ కు కోడింగ్ లో మంచి పట్టు ఉండటంతో పాటు బగ్స్ ను కనిపెట్టడంలో దిట్ట.

అయితే గత నెల 29న అరుణ్ ఫేస్ బుక్ కోడ్ లో లోపాలను పసిగట్టాడు. ఈ లోపాల గురించి వెంటనే ఫేస్ బుక్ సెక్యూరిటీ టీం తెలిపాడు. ఆ తరువాతి రోజే ఫేస్ బుక్ నుంచి ప్రశంస పత్రం అందుకున్నాడు. ఈ నెల ఆరున ఆ లోపాన్ని సవరించారు. దాంతో అరుణ్ కు ఫేస్ బుక్ యాజమాన్యం నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఫేస్ బుక్ కోడ్ లో లోపాలను పసిగట్టినందుకు అరుణ్ కు రూ.10.70 లక్షలు పారితోషికం ప్రకటించింది.

ఫేస్ బుక్ లో లోపాలను గుర్తించినవారికి పారితోషికం ఇచ్చే పథకం 2011లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. గూగుల్, ఫేస్ బుక్ లలో అనేక బగ్స్ ను గతంలో కూడా కనిపెట్టి, ప్రశంసలు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ లోపాన్ని గుర్తించినందుకు ఫేస్ బుక్ ఆయనకు రూ.7 లక్షలు బహుమతి ఇచ్చింది. గత మూడేళ్ళలో బగ్స్ ను కనిపెట్టడం వల్ల ఆయనకు రూ.30.85 లక్షలు లభించింది. లాస్ వేగాస్ లో జరిగే ఫేస్ బుక్ సెక్యూరిటీ టీమ్ తో సమావేశానికి హాజరుకావాలని వివిధ దేశాలకు చెందిన ముగ్గురు హ్యాకర్లను ఫేస్ బుక్ ఆహ్వానించింది. వీరిలో అరుణ్ ఒకరు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఫేస్ బుక్ హాల్ ఆఫ్ ఫేమ్ లో అరుణ్ 10వ స్థానంలో ఉన్నారు. ఈ ఘనత సాధించి ఏకైక భారతీయుడు ఆయనే.

Related

  1. ఫేస్ బుక్ వల్ల అమ్మానాన్నలపై కేసు పెట్టిన కూతురు!
  2. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు అని పిచ్చ కొట్టుడు కొట్టారు
  3. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  4. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -