Tuesday, May 14, 2024
- Advertisement -

రేటు పెంచిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -
pelli choopulu hero rate is increased

పెళ్లిచూపులు సినిమాతో స్టార్‌నైట్ హీరో అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాలో హీరో నాని ఫ్రెండ్ క్యారెక్ట‌ర్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఆ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. త‌ర్వాత పెళ్లిచూపులు సినిమాతో ఇండ‌స్ట్రీలో మంచి హిట్ కొట్టి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.

ఇక ఈ వారం విజ‌య్ న‌టించిన ద్వార‌క సినిమా మంచి హైప్‌తో రిలీజ్ అవుతోంది. పెళ్లి చూపులు క్రేజ్‌తో చాలా ఛాన్సులు కొట్టేశావే అని అడిగితే విజ‌య్ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చాడు. అవునండీ రేటు పెంచేశాను అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నాడు. రెండు సంవత్సరాలు కష్టపడితే ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రోల్ దక్కింది. ఆ రోల్ దక్కక ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశాన‌ని చెప్పాడు. తాను యాక్ట‌ర్ కాక‌పోయి ఉంటే ఖ‌చ్చితంగా డైరెక్ట‌ర్ అయ్యి ఉండేవాడిన‌ని కూడా చెప్పాడు. పెళ్ళిచూపులు సినిమా రిలీజైన తరువాత మనోడి ఫేట్ మారిపోయింది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ ద్వారక ఇప్పుడు హైప్ తో రిలీజ్ అవ్వడానికి కారణం పెళ్లి చూపులే.ఇక ప్ర‌స్తుతం మనోడి చేతిలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రెండు సినిమాల‌తో పాటు మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. అది ప్ర‌స్తుతం మ‌నోడి రేంజ్‌.

{youtube}0dN2ZfrEvuw{/youtube}

Related

  1. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
  2. కాటమరాయుడు పక్కా హిట్.. ఎందుకంటే..?
  3. టాప్ దర్శకుడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్!
  4. సైలెంటుగా లిప్ లాక్ పెట్టేసిన ఆదా శర్మ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -