Friday, May 17, 2024
- Advertisement -

అనుష్క వల్ల రాజమౌళికి చుక్కలు కనిపిస్తున్నాయి..?

- Advertisement -
Rajamouli Comments On Baahubali 2 Trailer

అరుంధతి, పంచాక్షరి,రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మక సినిమాలో నటించి లేడీ ఓరియెటెడ్ రోల్స్ లో  మెప్పించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న  ‘బాహుబలి’ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి అదరహో అనిపించుకుంది. ఇక సైజ్ జీరో మూవీలో బాడీ వెయిట్ పెంచుకొని ఆంటీలా కనిపించింది. ఇటీవల విడుదలైన ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాల్లో అనుష్కను బొద్దు ఉడటం చూసి అందరూ షాక్ అయ్యారు.

ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘బాహుబలి 2 ’ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు..అయితే దీనికి వెనుక ఓ రహస్యం దాగి ఉంది.  ఈ సినిమాలో అనుష్క పాత్ర కీలకం. ఈ రెండో భాగానికి సంబంధించి అనుష్క సీన్లను మొదటి భాగంతోపాటే తీశారు. కొన్ని సీన్లను మాత్రం ఇటీవల షూట్‌ చేశారు. అప్పట్లో అనుష్క సన్నగా నాజూగ్గా ఉండేదట..కానీ ఈ మద్య అనుకోకుండా లావు కావడంతో సమస్య ఎదురైందట రాజమౌళికి. అందుకే అనుష్కకు సంబంధించిన సీన్లకు భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్‌ను వాడుతున్నారట.

అంతే కాదు ఆ మద్య బాహుబలి కి సంబంధించిన పోస్టర్ లో ప్రభాస్, అనుష్క ఫోటో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో అనుష్క సన్నగా కనిపిస్తుంది..అయితే ఈ ఫోటోపై రక రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. సినిమా అంతా అనుష్కను అలా చెక్కడానికి గ్రాఫిక్స్‌ టీమ్‌ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోందట. అందుకే ట్రైలర్‌ కాస్తా లేట్ అవుతుందని తెలుస్తోంది. ట్రైలర్ ఆలస్యానికి కారణం గ్రాఫిక్స్ వర్కే కారణమని, వీఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్లు గ్రాఫిక్స్ ఇచ్చిన వెంటనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. 

{youtube}6GrZ4O_zi9Y{/youtube}

Related

  1. అనుష్క చేసిన ప్రయోగం తిప్పికొట్టింది.. అందుకే అలా అయ్యింది..!
  2. అనుష్క పెళ్లి జరిగిపోయింది.. ఎవరితో తెలుసా..?
  3. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?
  4. అనుష్క పెళ్లిపై కొత్త న్యూస్.. ఎవరితో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -