Friday, May 17, 2024
- Advertisement -

ప్రెస్టీజియస్ వెంచర్లకు మరమ్మత్తులు

- Advertisement -

ప్రెస్టీజియస్ వెంచర్లన్నీ…లాంచ్ కు ముందే…షెడ్ కు వెళ్లిపోతున్నాయి.ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుసుకునే లోపలే స్ట్రక్చురల్ డ్యామేజ్ జరిగిపోతుంది.దీంతో సెట్స్ మీద ఉన్న ప్రతి ప్రాజెక్ట్ పై…. 

లేనిపోని నీలినీడలు కమ్ముకోకుండా డైరెక్టర్స్ జాగ్రత్త పడుతున్నారు.  సినిమా ఎంతో  బాగా వచ్చింది కదా….ఇక రిలీజ్ చేసేద్దామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తలెత్తుతూనే ఉంది.దీంతో అప్పటి వరకు సినిమాకున్న హైప్ కూడా ఒక్కసారిగా అమాంతం పడిపోతోంది.ప్రస్తుతం టాలీవుడ్లో బడా బాబుల సినిమాల విషయంలో జరుగుతుందిదే.ఫస్ట్ లుక్ ,టీజర్లతో అంచనాలను మించిపోయేలా సినిమా గురించి ఊదరగొట్టేస్తూ… రిలీజ్ డేట్లు ఎనౌన్స్ చేసేసాక ఒక్కసారిగా హీరోలు వాయిదా అనే మాటను నెటిజన్లకు చెప్పి ఆ తరువాత కామ్ అయిపోతున్నారు.

ఎంతగానో ఎక్కువగా ఊహించుకున్న చిత్రాలు ఇలా డల్ అయిపోవడం వెనుక కారణాలు చాలానే  కనిపిస్తున్నాయి.ముందుగా తాము అనుకున్న చిత్రానికి మాంచి క్రూ ని తీసుకుంటున్నారు.వారి గురించి ఎక్కువగా ఊహించేసుకుని ఇక అంతా వారే  చూసుకుంటారు కదా అని హీరోలు అనుకుంటున్నారు.టైమ్ లైన్ రీచ్ అయ్యే సరికి టెన్షన్ లో తాము తీసి పారేసిన సినిమా రష్ ను డైరెక్టర్లు హీరోలకు చూపించడం ఆతరువాత మార్పులు చేర్పులు చెప్పడం,అవి కూడా ఇన్ టైమ్ కు ఫినిష్ కాకపోవడంతో ఇక చేసేదేం లేక చేతులెత్తేయడాలు ఇపుడు సర్వ సాధారణమై పోయింది.అఖిల్ చిత్రంలో జరిగిందదే.గ్రాఫిక్స్ పేరు చెప్పి ఎంతో తెలివిగా తప్పించుకున్నప్పటికీ… సినిమా రష్ చూసాక నాగ్ సీరియస్ అవ్వడం,ఆ తరువాత వినాయక్ మొఖం తిప్పేసుకోవడం,అఖిల్ మౌనం వీడకపోవడం చకచకా జరిగిపోయింది..

అక్కినేని ఫ్యామిలీ విషయంలో ఇలాంటిదే మరొకటి జరుగుతుంది.అదే  సోగ్గాడే చిన్ని నాయన.ఈ ఫిలిం ఇప్పటి వరకూ టూ టైమ్స్ రీ షూట్ లకు వెల్లిందనేది పరిశ్రమలో వినిపిస్తోన్న మాట.డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను ఓ స్థాయిలో తీర్చిదిద్దుతాడని నాగ్ బావించాడు. రష్ చూసాక సినిమా తేలిపోతుందనే భయం కింగ్ ను వెంటాడింది. రీ షూట్ లకు కొన్ని సీన్లను కేటాయించాడు.ఆతరువాత ఫైనల్ రష్ చూసాక..కథనంలో ఇంకొన్ని సీన్స్ పెడితే బాగుంటుందని మరింతగా మరమ్మత్తులు చేయిస్తున్నాడు.అది వచ్చి… సినిమా నచ్చితేగాని నాగ్ సోగ్గాడే చిత్రం పై కరెక్ట్ డేట్ అంటూ ఒకటి ఇవ్వడని పరిశ్రమ చెబుతుంది.

 ఇక లేటెస్ట్ గా బెంగాల్ టైగర్ చిత్రంలో కూడా సేమ్ టు షేమ్ ఇదే సీన్ .నవంబర్ మొదటివారం లేదా దీపావళికి సినిమా అనుకున్నారు. కాని చివరి నిమిషంలో నవంబర్ ఎండింగ్ అంటున్నారు.ఫైనల్ అవుట్ పుట్ చూసాక సంపత్ నంది,రవితేజలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. ఎందుకంటే..టైగర్లో కూడా కొన్ని ల్యాక్ లు ఎక్కువయ్యాయని, ఇంకొన్ని సీన్స్ షూట్ చేసి సినిమాకు కలిపితే బాగుంటుందని వీరు ఓ అవగాహనకు వచ్చారట.అందుకే మరమ్మత్తులు కోసం రీ షూట్ షెడ్ కు టైగర్ ను తీసికిపోతున్నారని ఫిలింనగర్లో రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి. మొత్తానికి ఏమాటకి ఆ మాటే చెపుకోవాలి గాని.. టాలీవుడ్ ప్రెస్టీజియస్ పిలింస్ 

మరమ్మత్తుల్లో మగ్గిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -