Wednesday, April 24, 2024
- Advertisement -

పవన్, మహేష్ మధ్యలో ప్రభాస్.. రంజుగా పొంగల్ పోటీ..!

- Advertisement -

సంక్రాంతి పండుగ టాలీవుడ్ లో సినిమాల విడుదలకి మెయిన్ సీజన్. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకునేందుకు భారీ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటాయి. మామూలుగా ఒక అగ్ర హీరో సినిమా వస్తుందంటే.. మరో అగ్ర హీరో సినిమా వారం లేదా రెండు వారాలపాటు విడుదల వాయిదా వేస్తుంటారు. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు విడుదలైతే రెండిటికీ కలెక్షన్ల దెబ్బ పడుతుందని. అయితే సంక్రాంతి సమయంలో మాత్రం రెండు మూడు రోజుల వ్యవధిలోనే అగ్ర హీరోల సినిమాలు పోటీ పడుతుంటాయి. అందుకు కారణం పండుగ సమయంలో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు రావడమే.

అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి సంక్రాంతి ఫైట్ టఫ్ గా మారింది. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీరిద్దరి సినిమాలు ఈసారి పొంగల్ బరిలో నిలవడంతో పోటీ తీవ్రంగా నెలకొంది. వీరిద్దరూ నటించిన సినిమాలు విడుదలైతే థియేటర్లు తగిన సంఖ్యలో లభించడం చాలా కష్టం. అలాంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కూడా సంక్రాంతి బరిలో నిలవడంతో పోటీ రంజుగా మారింది.

రాధే శ్యామ్ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మామూలుగా పవన్, మహేష్, ప్రభాస్ నటించిన సినిమాలు విడుదలైతే తెలుగు రాష్ట్రాలలోని ఆల్మోస్ట్ థియేటర్లలో వారి సినిమానే విడుదల అవుతుంది. అలాంటిది ఇప్పుడు ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి పోటీలో నిలవడంతో అసలు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు సరిపోతాయా అన్న సందేహం కలుగుతోంది.

ముగ్గురు అగ్ర హీరోల పోటీతో ఏ సినిమాకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరికే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగా ఏ సినిమాకు థియేటర్లు దొరక్క దెబ్బ పడుతుందో చూడాలి.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడులో కూడా పొంగల్ పెద్ద పండుగ. అక్కడ కూడా అగ్ర హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు పలువురు హీరోల సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

మామూలుగానే పవన్ కళ్యాణ్ నటించే సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలవుతుంటాయి. సర్కారు వారి పాట సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నటించే సినిమా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విడుదల అవుతుంది. ఇలా అగ్ర హీరోలు అందరూ ఒకే సారి తెరపైకి వస్తుండడంతో థియేటర్ల సమస్య నెలకొంది. తెలుగులో ఈ ముగ్గురు హీరోలతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 3 కూడా విడుదల కానుంది.

Also Read

త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -