త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

- Advertisement -

కొన్నిరోజులుగా స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని త్రిష పీఆర్ టీం తాజాగా ఖండించింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో త్రిష ఓ యువకుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే వివాహం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ఆ వార్తలు త్రిష దృష్టికి వెళ్లడంతో తన పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తన పీఆర్ టీమ్ ద్వారా ఆమె వెల్లడించింది.

కొన్నేళ్ల కిందట టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోతో త్రిష ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారిద్దరి పెళ్లి ఇక ఖాయమేనని అంతా భావించారు. అంతలోనే ఏమైందో తెలియదు. వారిద్దరూ విడిపోయారు. ఈ ఇష్యూ అనంతరం త్రిష టాలీవుడ్ లో సినిమాలు చేయడం మానేసింది. పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయింది.ఆ తర్వాత కొద్ది రోజులకు వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిషకు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్నారు. అప్పట్నుంచి త్రిష సినిమాలకే పరిమితం అయింది.

ఈ నేపథ్యంలో మళ్లీ ఆమె ఓ యువకుడిని పెల్లాడబోతున్నాడు వార్తలు రాగా అందులో నిజం లేదని తేలింది. ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పొన్నియన్ సెల్వన్ లో ఒక హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులోనూ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో త్రిష కు ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

Also Read

‘మా’ లో ముసలం.. కృష్ణంరాజుకు ఈసీల లేఖ కలకలం

ఓటీటీపై ఎర్రన్న సంచలన కామెంట్లు.. సీఎంలకు చురకలు..!

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -