కవల పిల్లలు కన్న సెలెబ్రిటీలు ఎవరో చూడండి..!

- Advertisement -

ప్రతి మనిషి జీవితంలో సంతానం అనేది ముఖ్య. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. అయితే సెలెబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. వారి వ్యక్తిగత విషయాలు బాగా స్ప్రెడ్ అవుతాయి. వీరిలో ట్విన్స్ పుట్టినవారు ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

సంజయ్ దత్ : సంజయ్ దత్ హీరోయిన్ మాన్యతా దత్ ని 2008లో మూడో వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో ఇద్దరు కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి. అబ్బాయికి షాహరాన్ అని అమ్మాయికి ఇక్రాన్ అని పేర్లు పెట్టారు.

మంచు విష్ణు : 2009లో హీరో మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన విరానికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఇద్దరు కవులు పిల్లలు పుట్టారు. ఆడ పిల్లలు అయిన వీరికి ఆరియానా, వీవియానా అనే పేర్లు పెట్టారు. ఆ తరువాత విష్ణు ఓ అబ్బాయి మరియు అమ్మాయికి జన్మనిచ్చారు.

ఉదయ భాను : ఉదయభాను మొదట ఒకరిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళకు అతనితో విడిపోయి విజయ్ కుమార్ అనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి కవల ఆడ పిల్లలు పుట్టారు. వీరికి యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే పేర్లు ఆమె పెట్టారు.

సన్నీ లియోన్ : సన్నీ లియోన్ డానియల్ వెబర్ ని 2011లో వివాహం చేసుకుంది. వీరు నిషా అనే ఓ ఆడపిల్లను 2017లో దత్తత తీసుకున్నారు. అదే ఏడాది సన్నీ లియోన్ ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. వీరికి అషర్ అండ్ నోహా అనే పేర్లు పెట్టారు.

కరణ్ జోహార్ : బాలీవుడ్ దర్శక నిర్మాత మరియు హోస్ట్ కరణ్ జోహార్ కి 2017లో ఇద్దరు కవలలు పుట్టారు. వీరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. వీరి పేర్లు రూహి మరియు యష్. ఐతే కరణ్ జోహార్ వైఫ్ ఎవరు అనేది సస్పెన్సు.

భరత్ : 2013లో భరత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ జెస్లీ ని పెళ్లి చేసుకున్నారు. 2018లో వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు. వీరికి ఆద్యన్, జేన్ అనే పేర్లు పెట్టారు.

Also Read

పవన్, మహేష్ మధ్యలో ప్రభాస్.. రంజుగా పొంగల్ పోటీ..!

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -